దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మరో నెల పొడిగించింది కేంద్రం.. జూన్ 30 వరకూ లాక్ డౌన్ ఉంటుంది, ఇక జూన్ 8 నుంచి దేవాలయాలు మాల్స్ తెరచుకోవచ్చు అని తెలిపింది కేంద్రం, ఇక తమిళనాడు లో కేసులు పెరుగుతున్న కారణంగా అక్కడ కూడా లాక్ డౌన్ కొనసాగుతుంది.
అయితే, చైన్నై సిటీలో మాత్రం ఇప్పుడప్పుడే ఆర్టీసీ బస్సులు తిరగబోవని, ప్రైవేటు వాహనాలను మాత్రం అనుమతిస్తామని సీఎం పళనిస్వామి చెప్పారు. గరిష్టంగా 60 మందితో టీవీ సీరియళ్ల షూటింగ్స్ కు కూడా అనుమతించారు. కచ్చితంగా మాస్క్ ధరించాలి అని భౌతిక దూరం పాటించి అవసరం అయిన వారితోనే తక్కువలో షూటింగులకి పర్మిషన్ ఇచ్చారు.
ఇక తమిళనాడు ప్రభుత్వం షూటింగులకి పర్మిషన్ ఇవ్వడంతో ఏపీ తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి, ఇక మెట్రో సర్వీసులు కూడా ఈనెలలో నడిపించే అవకాశం లేదు అని చెప్పింది కేంద్రం.