Agent OTT |అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. పాన్ ఇండియా చిత్రంగా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28న విడుదలైన ఈ మూవీ అఖిల్ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దారుణమైన కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో కేవలం 20రోజుల్లోనే ఓటీటీ(Agent OTT)లోకి వచ్చేస్తుంది ఈ చిత్రం. ప్రముఖ ఓటీటీ యాప్ ‘సోనీలివ్(Sonyliv)’ ఏజెంట్ డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈనెల 19 నుంచి ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటించగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) ప్రత్యేక పాత్రలో కనిపించాడు. కాగా ఏజెంట్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణమం తమదేనని.. కథ పూర్తిగా సిద్ధం కాకుండానే షూటింగ్ కు వెళ్లామని నిర్మాత అనిల్ సుంకర చెప్పిన సంగతి తెలిసిందే.
Read Also: ఇస్టాలో నటి కుష్భూ కూతురు గ్లామర్ షో.. నెటిజన్లు ఫైర్
Follow us on: Google News, Koo, Twitter