Akkineni Akhil: బ్యూటీ కేర్‌ తప్పనిసరి.. అక్కినేని అఖిల్‌

-

బ్యూటీకేర్‌ అందరికీ అవసరం, గ్లామర్‌ ఫీల్డ్‌లో అందం మరింత ఆత్మస్థైర్యాన్ని అందిస్తుందని ప్రముఖ టాలీవుడ్‌ స్టార్‌ అక్కినేని అఖిల్‌ తెలిపారు. ఆదివారం సైనిక్‌పురి వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్వీ సెలూన్‌ అండ్‌ స్పాను అఖిల్, సినీతార సాక్షి వైద్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడుతూ., ఎన్వీ సెలూన్‌ అండ్‌ స్పా చాలా లగ్జరీగా ఉందని, విభిన్నమైన బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సినిమా రంగంలో బ్యూటీ కేర్‌ తప్పనిసరి, యాక్టింగ్‌లో భాగంగా తను కూడా బ్యూటీ కేర్‌ తీసుకంటానని పేర్కొన్నారు.

- Advertisement -

akkineni akhil

ఈ స్పా తనను చాలా ఆకట్టకుందని త్వరలో ఇందులోనే స్పెషల్‌ హేయిన్‌ కట్‌ చేయించుకుంటానని అన్నారు. బ్యూటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ఇన్వీ సెలూన్‌ మరింత పురోభివృద్ధి సాధించాలని అఖిల్‌ ఆకాంక్షించారు. లగ్జరీ బ్యూటీ సెలూన్‌ను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అఖిల్‌ ఏజెంట్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, 28న అందరి ముందుకు మరో మంచి సినిమాతో వస్తున్నాని తెలిపారు. అందంతో ఆత్మవిశ్వాసంను పెంపొందించుకోవచ్చని ఏజెంట్‌ హీరోయిన్‌ సాక్షివైద్య అన్నారు. సిటీలో ఇంతటి లగ్జరీ సెలూన్‌ చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అంతర్జాతీయ సౌందర్య ఉత్పత్తులన్నీ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని సెలూన్‌ ఎం డి దీపా తెలిపారు.

NV Saloon

మార్కెట్‌లోని బ్రాండ్లకు విభిన్నమైన, వినూత్నమైన సౌందర్య ఉత్పత్తులను అందిస్తున్నామని, బ్యూటీ రంగంలోని అధునాతన సాంకేతికతతో సేవలను కొనసాగిస్తున్నామన్నారు. . హెయిర్‌ కట్, మసాజ్, బ్రైడల్‌ మేకప్, ఫేషివల్, బాడీ వ్యాక్స్, మానిక్యూర్, పెడిక్యూర్‌ థ్రెడింగ్‌ వంటి సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే బ్యూటీ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నామని సూచించారు. త్వరలో సిటీలో మరిన్ని ఎన్వీ సెలూన్‌ అండ్‌ స్పా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపింది. సెలూన్‌ను ప్రారంభించేందుకు ఏజెంట్‌ మూవీ టీం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రారంభోత్సవంలో సినీ దర్శకులు సురేందర్‌ రెడ్డి, ఐశ్వర్య రాజీవ్, రణధీర్‌ రెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాషన్‌ ఔత్సాహికులు పాల్గొన్నారు.

Read Also: తాత అయిన రేవంత్ రెడ్డి.. మనవడి ఫోటో షేర్ చేస్తూ…

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...