నాగ చైతన్య హీరోగా ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. వైజాగ్ షెడ్యూల్ లో దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. ఈ మూవీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నది.
ఈ మధ్యలో మేర్లపాక గాంధీ చైతుతో సినిమా చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థలో సినిమా చేయాల్సి ఉంది. అయితే, ఇప్పుడు చాలా బిజీ అయ్యాడు. వెంకీమామ తరువాత ఈ హీరో, శేఖర్ కమ్ముల సినిమా, ఆ తరువాత తన తండ్రితో కలిసి బంగార్రాజు మూవీ చేయాల్సి ఉన్నది. శేఖర్ కమ్ముల, బంగార్రాజు సినిమాలు వరసగా ఉన్నాయి. ఈ సమయంలో మేర్లపాక గాంధీ సినిమా అంటే కొంచం కష్టమే. కాకపోతే బడా నిర్మాణ సంస్థ నుంచి సినిమా కాబట్టి చైతు అలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం సినిమాలకు దర్శకత్వం వహించారు.