ANR Awards |మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్‌పై హీరో నాగార్జు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ANR(అక్కినేని నాగేశ్వర రావు) జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో నాగార్జున మాట్లాడాడు. 2024కు గానూ ఈ అవార్డు చిరుకు దక్కింది. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ బిగ్‌బీ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా నాగార్జున(Nagarjuna) మాట్లాడుతూ.. చిరంజీవి(Chiranjeevi) డ్యాన్స్‌లో గ్రేస్ చూసి కాస్త టెన్షన్ పడ్డానని చెప్పాడు. చిరంజీవి హిట్లు, సూపర్ హిట్లు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఇటీవల గిన్నీబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించి తానేంటో నిరూపించుకున్నారంటూ వ్యాఖ్యానించాడు నాగార్జున.
ANR Awards | ‘‘చిరంజీవితో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నేను సినిమాల్లోకి రావాలని అనుకుంటున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి నటిస్తున్న ఓ సినిమా పాట చిత్రీకరణ జరిగింది. అప్పుడు నాన్న నన్ను రమ్మన్నారు. ‘సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావ్ కదా.. అక్కడ చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నాడు వెళ్లి చూడు. నేర్చుకోవచ్చు’ అని అన్నారు. దాంతో అక్కడకు వెళ్లాను. అది రెయిన్ సాంగ్.. వైట్ డ్రెస్సులో రాధతో చిరు చిందేస్తున్నారు. ఆయన డ్యాన్స్‌లో గ్రేస్ చూసి అప్పుడు కొంచెం భయపడ్డాను. ఈయనలా డ్యాన్స్ చేయడం మనవల్ల అవుతుందా? సినిమా ఫీల్డ్ కాకుండా మరోదారి ఏదైనా వెతుక్కుందామా? అని ఆలోచించుకుంటూ బయటకు వచ్చేశా’’ అని చిరుతో ఉన్న తన జ్ఞాపకాన్ని ఒకదాన్ని నాగార్జున పంచుకున్నారు.