అక్షయ్ కుమార్‌- చిరంజీవి -ఆర్య- పునీత్ రాజ్ కుమార్ కొత్త క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ?

Akshay Kumar- Chiranjeevi-Arya- Puneet Rajkumar New Campaign Program

0
116

ఏదైనా విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయాలంటే, సెల‌బ్రిటీల ద్వారా అయితే చాలా సులువుగా రీచ్ అవుతుంది. అభిమానుల‌తో పాటు సినిమా ప్రేక్ష‌కులు అంద‌రూ కూడా దీనిని రిసీవ్ చేసుకుంటారు. అందుకే ప్ర‌త్యేక‌మైన క్యాంపెయిన్ ప్రొగ్రామ్స్, ఇలా సినిమా తార‌ల‌తో చేస్తాయి ప‌లు సంస్ద‌లు. ఇంత‌కీ ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు అనుకుంటున్నారా వివ‌రాలు చూద్దాం.

ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహన పెంచడానికి , ఓ సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీనికి
కరోనా కో హరానా హై అనే పేరుని పెట్టుకున్నారు.కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది, కరోనా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవ‌స‌రం, జాగ్ర‌త్త‌లు, ఇవ‌న్నీ ఈ కార్య‌క్ర‌మంలో తెలియ‌చేస్తారు. అయితే ఈ ప్రొగ్రామ్ స్టార్ హీరోలు వివ‌రిస్తే ప్ర‌జ‌ల‌కు బాగా రీచ్ అవుతుంద‌ని, అన్నీ చిత్ర సీమ‌ల్లో సినీ తారల సహాయం కోరారు.

దీంతో ఈ ప్రోగ్రామ్‌లో బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్‌తో పాటు, మ‌న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ నుంచి చిరంజీవి, ఇటు కోలీవుడ్ నుంచి ఆర్య‌, క‌న్న‌డ చిత్ర సీమ నుంచి పునీత్ రాజ్ కుమార్ పాల్గొంటున్నారు.