అక్షయ్ కుమార్ మరోసారి భారీ ఆర్ధికసాయం ఈసారి ఎవరికంటే

అక్షయ్ కుమార్ మరోసారి భారీ ఆర్ధికసాయం ఈసారి ఎవరికంటే

0
105

కరోనా పై పోరులో మేము సైతం అంటూ సినిమా ప్రముఖులు పారిశ్రామిక ,వ్యాపారవేత్తలు రాజకీయ నేతలు ఇలా అందరూ సాయం చేశారు. భారీ విరాళాలు అందచేశారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 25 కోట్లు విరాళం అందజేశారు.

తర్వాత మరోసారి ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
అక్కడ ఉద్యోగుల ఆరోగ్యం కోసం మున్సిపల్ కార్మికుల కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కు ఈ నగదు అందచేశారు.

అక్షయ్ దేశం అంతా రీల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే తాజాగా మరోసాయం చేశారు ఆయన..గత నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి.

అక్కడ ప్రజలను ఆదుకునేందుకు వరద బాధితుల కోసం బిహార్, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ పండ్కు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా వరుస సాయాలు చేస్తున్న అక్షయ్ ఉదార స్వభావానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.