అక్షర టీజర్ టాక్: కొంచెం కామెడీ.. కొంచెం సస్పెన్స్..!!

అక్షర టీజర్ టాక్: కొంచెం కామెడీ.. కొంచెం సస్పెన్స్..!!

0
87

ఒక వైపున హారర్ థ్రిల్లర్ చిత్రాలను .. మరో వైపున సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను చేస్తూ నందిత శ్వేత మంచిపేరు తెచ్చుకుంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘అక్షర’ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్రలో కనిపించనుంది. బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు.

అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. అక్షరపై మనసు పారేసుకున్న అజయ్ ఘోష్ .. షకలక శంకర్ .. సత్య .. మధునందన్ ల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది. ఆమెను చంపేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తారు. ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలపై ఆసక్తిని పెంచుతూ టీజర్ ను కట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.