అల్లు ఫ్యామిలీకి అల వైకుంఠపురం నుంచి ఎంత వచ్చిందంటే

అల్లు ఫ్యామిలీకి అల వైకుంఠపురం నుంచి ఎంత వచ్చిందంటే

0
87

అల వైకుంఠపురం సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది అనేది తెలిసిందే, ఇక టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది.. అంతేకాదు బన్నీకి ఆల్ టైమ్ రికార్డ్ హిట్ ఇచ్చింది. అటు నిర్మాతలకు, ఇటు హీరోకి, దర్శకుడికి కూడా అద్భుత విజయాన్ని అందించింది. అయితే ఈ విజయం సంగతి అలా వుంచితే, ఈ సినిమా వల్ల టోటల్ గా అల్లు ఫ్యామిలీకి ఎంత సంపద సమకూరింది అన్నది అందరూ చర్చించుకుంటున్నారు.

ఎందుకు అంటే ఈ సినిమా అల్లు వారు నిర్మాతలు అలాగే బన్నీ హీరో, సో గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది.
అల్లు అర్జున్ రెమ్యూనిరేషన్ 24 కోట్ల వరకు వుంది. ఇది కాక, గీతా సంస్థకు సినిమాకు వచ్చే లాభాల్లో 40శాతం వాటా. సినిమాకు పెట్టుబడి పెట్టి, నిర్మించిన హారిక హాసినికి 60శాతం వాటా వుంటుందని తెలుస్తోంది.

దీంతో అల్లు వారి ఫ్యామిలీకి ఈ సినిమా పేరు చెప్పి మంచి లాభాలు వచ్చాయి అంటున్నారు, మొత్తం సినిమాకి నిర్మాతలకి 40 కోట్ల వరకూ ప్రాఫిట్స్ వచ్చాయి అంటున్నారు.. ఇందులో గీతా ఆర్ట్స్ కి దాదాపు 16 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంతేకాదు రెండు ఏరియాలను గీతా సంస్థ డిస్ట్రిబ్యూషన్ కు తీసుకుంది అని తెలుస్తోంది. అక్కడ 20 పర్సంట్ కమిషన్ కూడా వస్తుంది అని అంటున్నారు.. సో ఓవరాల్ గా సినిమాపై మంచి లాభాలు వచ్చాయి అల్లు ఫ్యామిలీకి