టైటిల్ మార్చినా…పాట దుమ్ములేపుతుందిగా..!!

టైటిల్ మార్చినా...పాట దుమ్ములేపుతుందిగా..!!

0
87

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం అల వైకుంటపురం లో.. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి మార్కులు రాగ, తాజాగా ఈ సినిమాలో సాంగ్‌కు సంబంధించిన ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

`సామజవరగమన..` అంటూ సాగే పాట ప్రొమోకు చాలా మంచి స్పందన వస్తుంది.ఈ క్రమంలో ఈ సినిమా ఇంగ్లీష్ టైటిల్‌లో చిన్న మార్పు కనపడింది. ఇది వరకు సినిమా ఇంగ్లీష్ టైటిల్‌ను ala vaikuntapuramulo గా పెట్టారు.

అయితే ఇప్పుడు సాంగ్ ప్రొమో విడుదల సమయంలో దీన్ని ala vaikuntapurramulooగా మార్చారు.జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.