యూట్యూబ్ ని షేక్ చేస్తున్న థమన్ ఏం చేశాడో చూడండి

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న థమన్ ఏం చేశాడో చూడండి

0
102

యూట్యూబ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.. సినిమాల ట్రైలర్లు టీజర్లతో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ట్రెండింగ్ లో చూసుకుంటే పెద్ద సినిమాల హవా కనిపిస్తోంది.. ట్రైలర్ టీజర్ వచ్చింది అంటే చాలు అవే ట్రెండ్ అవుతాయి.. తాజాగా మూడు పెద్ద సినిమాలకు సంబంధించిన సాంగ్స్ ట్రైలర్ టీజర్ ట్రెండ్ అవుతోంది.

మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్ సూర్యుడివో… చంద్రుడివో..వీడియో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది, ఇక సంక్రాంతికి వస్తున్న అల వైకుంఠపురంలో బన్నీ టీజర్ ఫస్ట్ గ్లిమ్స్ రెండవ స్ధానంలో ఉంది, ఇక మూడవ స్ధానంలో వెంకీమామ ట్రైలర్ ఉంది.. అయితే ఇక్కడ ఓ విచిత్రం ఉంది
నాలుగవ స్థానంలో డిస్కో రాజా టీజర్ చివరిగా ఐదో స్థానంలో రూలర్ ట్రైలర్ ట్రెండ్ అవుతున్నాయి.

మరో విశేషం ఏమిటంటే ఈ ఐదు ట్రెండింగ్ వీడియోస్ లో మూడు చిత్రాలకు థమన్ సంగీతం అందించారు దీంతో ధమన్ క్రేజ్ ఎలా ఉందో యూ ట్యూబ్ లో కనిపిస్తోంది..అలవైకుంఠపురంలో , డిస్కో రాజా,వెంకీ మామ చిత్రాలకు థమన్ సంగీతం అందించారు మొత్తానికి సరిగమ పదనిసలతో యూ ట్యూబ్ ని షేక్ చేస్తున్నాడు థమన్ అంటున్నారు అభిమానులు .