తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అల్లు అర్జున్ మ‌రో స‌రికొత్త రికార్డ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అల్లు అర్జున్ మ‌రో స‌రికొత్త రికార్డ్

0
84

అల వైకుంఠపురం నిజంగా ఈ సినిమా ఓ సంచ‌ల‌నం అనే చెప్పాలి, స‌రికొత్త రికార్డులు ముందు నుంచి క్రియేట్ చేసింది టీజ‌ర్ ట్రైల‌ర్ పాట‌లు ఇలా అన్నీ ఓ సంచ‌ల‌న‌మే ..యూ ట్యూబ్ లో అన్నీ షేక్ అయ్యాయి, అందుకే అన్ని రికార్డులు బ‌న్నీకి ఈ చిత్రంతో వ‌చ్చాయి, సౌత్ ఇండియాలో ఈ సినిమా సాంగ్స్ ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ పాపుల‌ర్ అయ్యాయి.

ఇక బ‌న్నీకి ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన సినిమాల్లో ఇది అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టింది, ఇక తాజాగా ఓ సూప‌ర్ రికార్డ్ సొంతం చేసుకుంది అల వైకుంఠ‌పురం… తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకూ మరెవరికీ దక్కని వన్ బిలియన్ వ్యూస్ రికార్డును సాధించింది.

యూ ట్యూబ్ లో సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని ఓ ట్వీట్ ద్వారా తెలియజేసిన గీతా ఆర్ట్స్, మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అని పేర్కొంది.
ఇక సినిమాలో ప్ర‌తీ పాటా హిట్, ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు సినిమాలు ఇంత పెద్ద ఎత్తున పాట‌లు హిట్ అయింది లేదు అంటున్నారు సినిమా పెద్ద‌లు.