అల‌వైకుంఠ‌పుర‌ములో బాలీవుడ్ కు – నటీన‌టులు వీరేనా?

Ala Vaikunthapurramuloo Movie in Bollywood - Who are the actors?

0
133

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత సూప‌ర్ హిట్ అయిందో తెలిసిందే. ఇక సంగీతం సూప‌ర్ హిట్. త‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇక సినిమా ఎక్క‌డ విడుద‌లైనా అక్క‌డ బాక్సాఫీస్ వ‌సూళ్లు అదిరిపోయాయి. ఇక ఈ సినిమా హిందీలో రానుంద‌ట‌.

ఏక్తా కపూర్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ – కృతి సనన్ ను కొన్ని రోజుల క్రితమే ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో కీల‌క పాత్ర ట‌బుది, ఈ పాత్ర కోసం బాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోయిన్ ని తీసుకోనున్నార‌ట‌.

కీలకమైన పాత్ర కోసం మనీషా కొయిరాలాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.టబు చేసిన పాత్రను హిందీలో మనీషా కొయిరాలా చేయనుందని బీ టౌన్ వార్త‌లు వినిపిస్తున్నాయి.టబు తండ్రి పాత్రను పోషించిన సచిన్ కేద్కర్ స్థానంలో పరేష్ రావెల్ ని తీసుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకి రోహిత్ ధావన్ దర్శకత్వం వ‌హించ‌నున్నార‌ట‌. ఈ సినిమాకి యువరాజు అనే అర్దం వ‌చ్చేలా షెహ్ జాదా అనే టైటిల్ పెట్ట‌నున్నారు అని బీ టౌన్ టాక్.