అలవైకుంఠపురంలో బన్నీ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్

అలవైకుంఠపురంలో బన్నీ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్

0
96

టాలీవుడ్ లో బన్నీ క్రేజ్ ఇంతా అంతా కాదు కేరళలో కూడా బన్నీకి అంతే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. యూత్ ఐకాన్ గా ఆయనకు క్రేజ్ ఉంది, అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా అది అభిమానులకి నచ్చుతుంది.. కోట్లాది మంది అభిమానులు ఆయన స్లైట్ లుక్ ఫాలో అవుతారు.. ఇక ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ బిజినెస్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు విడుదల చేశారు. ఆ రెండు పాటలుకూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక తాజాగా బన్నీ ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అనే విషయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి, అయితే ఆయన 25 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని ఓ వార్త వినిపిస్తోంది..ఈ సినిమాకి అల్లు అరవింద్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా థియట్రికల్ రైట్స్ దాదాపు 100 కోట్లకు, హిందీ డబ్బింగ్ హక్కులు 19.5 కోట్లకు అమ్ముడయ్యాయి.120 కోట్ల రూపాయలు ఈ సినిమాకి అయింది అని టాక్ నడుస్తోంది. మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతికి రికార్డుల మోత మోగనుంది టాలీవుడ్ లో.