అల వైకుంఠపురములో కొత్త అప్ డేట్

అల వైకుంఠపురములో కొత్త అప్ డేట్

0
126

హీరో అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ మ‌రో హిట్ కోసం రెడీ అవుతున్నారు, తాజాగా వీరి కాంబోలో వ‌స్తున్న చిత్రం అల వైకుంఠపురములో.. ఈ సినిమాని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమానుల‌కు టీజ‌ర్ల పండుగ జ‌రుగుతోంది.

తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ టీజర్ రాబోతుంది. బ్యూటీఫుల్ మెలోడీ బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ను డిసెంబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్రబృందం పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది.

దీంతో బ‌న్నీ అభిమానులు దీని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అల్లు వారి అబ్బాయి సాంగ్స్ అన్నీ ట్రెండింగ్ లో ఉన్నాయి రాములో రాములా పాట చిత్రానికి హైలెట్ అవుతుంది అనేది తేలిపోయింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. చూడాలి ఈ సినిమా బ‌న్నీకి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో.