అలాంటి సినిమాలు చేయను పాయల్

అలాంటి సినిమాలు చేయను పాయల్

0
104

టాలీవుడ్ లో ఈ మధ్య సూపర్ సక్సస్ అయిన హీరోయిన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్ అంటే పాయల్ రాజ్ పుత్ అనే చెప్పాలి..అందమైన కథానాయికలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు..ఆర్ ఎక్స్ 100 చిత్రంలో పాయల్ అందాలు నటనతో ఆమెకు మంచి స్టార్ డమ్ వచ్చింది.

కుర్రాళ్ల మనసు దోచింది ఈ ముద్దుగుమ్మ..రొమాన్స్ ప్రధానంగా కలిగిన సినిమాల్లోనే పాయల్ కి అవకాశాలు వస్తున్నాయి.. అవి చేసుకుంటూ ముందుకు సాగుతోంది పాయల్… తాజాగా వెంకటేష్ నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ చిత్రంలో నటించింది, నటనకి అవకాశం వున్న ఈ సినిమాలో పాత్ర ఆమెకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది.

ఇక ఫ్యామిలీ, లవ్, ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలి అని అనుకుంటోంది పాయల్, అందుకే ఇక రొమాన్స్ ఉండే కథలు సినిమాలు చేయకూడదు అని భావిస్తోంది, ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గర అవ్వాలి అని చూస్తోందట పాయల్, ఆ పాత్రలకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి అని భావిస్తోంది…. ప్రస్తుతం ఆమె రవితేజ తో కలిసి డిస్కోరాజాలో నటించిన విషయం తెలిసిందే