తన బర్త్ డే కి పని మనుషులకు 50 లక్షలు ఇచ్చిన టాప్ హీరోయిన్

తన బర్త్ డే కి పని మనుషులకు 50 లక్షలు ఇచ్చిన టాప్ హీరోయిన్

0
141

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మూవీ లో రామ్ చరణ్ కి జోడి గా నటిస్తున్న విషయము అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంచితే తన 26వ పుట్టినరోజు సందర్భంగా ఆమె తన దగ్గర పని చేసే ఇద్దరు డ్రైవర్ లకు చెరో పాతిక లక్షలు ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేసిందట. దీంతో వారు ముంబయి శివారులో రెండు చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నారట. అలియా వారిని తన ఇంట్లో మనుషుల్లానే చూస్తుందట. అందుకే వారికంటూ సొంత ఇల్లు ఉండాలని భావించి డబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా తన వద్ద పని చేసే అందరికీ తనవంతు సాయం చేస్తుందట. వారికి ఎలాంటి అవసరం వచ్చిన తనే దగ్గర చూసుకుంటుందట. చిన్న ఏజ్ లో సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అలియా. ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’, ‘కళంక్’ లాంటి పెద్ద సినిమాలో నటిస్తోంది.