అలియా భట్ ‘జిగ్రా’ కథ దాని గురించేనా.. ట్రైలర్ ఎలా ఉంది..!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) నటిస్తున్న తాజా సినిమా ‘జిగ్రా’. ఈ మూవీ ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై తారా స్థాయి అంచనాలు ఉన్నప్పటికీ తాజా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింత అధికం చేసింది. కథపై ఒక స్కోప్ ఇస్తూనే ఇది నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ పార్ట్‌ కూడా గట్టిగానే ఉండనున్నట్లు ట్రైలర్ చెప్తోంది. ఈ సినిమా అంతా కూడా అక్క తమ్ముడి మధ్య ఉండే అనుబంధంపై కొనసాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్ పరంగా చూస్తే బాగానే ఉండేలా ఉంది కానీ కథను ఎలా నడిపించాడు దర్శకుడు అన్నదే సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది ఆధారపడి ఉంది. ట్రైలర్ అంత వరకు అయితే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చూపుతోంది.

- Advertisement -

Alia Bhatt – Jigra | ట్రైలర్ ఏం చెప్తోందంటే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కాతమ్ముడు అనాథలవుతారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. బంధువుల దగ్గరే పెరుగుతారు. పెద్దయిన తర్వాత తమ్ముడు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్తాడు. అతడిని ఉరితీయడానికి పోలీసు రెడీ అవుతారు. తమ్ముడంటే అక్కకు పంచ ప్రాణాలు కావడంతో అతడిని కేసు నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. చివరకు ఏమైంది. అక్కాతమ్ముళ్లు కలిశారా లేదా అనేదే కథ. మరి కథను ట్విస్ట్‌లు, యాక్షన్, సెంటిమెంట్ ఎపిసోడ్‌లతో రంగరించి తీస్తే సినిమా పక్కా హిట్ అవుతుంది. మరి ఈ సినిమా దర్శకుడు మనసులో సినిమా ఎలా ఉందో తెలియాలంటే అక్టోబర్ 11 వరకు వేచి చూడాల్సింది.

Read Also: MBU వివాదంపై మంచు మనోజ్ రియాక్షన్ ఇదే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...