సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార మహేష్ లా చాలా అందంగా ఉంటుంది, బుల్లి బుల్లి మాటలతో తండ్రితో ఎప్పుడూ సరదాగా దిగిన ఫోటోలని కూడా షేర్ చేస్తుంది, ఇక సినిమా సెలబ్రెటీల పిల్లల్లో అందరి కంటే ఆమెకి మంచి పాలోయింగ్ సోషల్ మీడియాలో ఉంది, ఇక మహేష్ కూడా విదేశాలకు వెళ్లిన సమయంలో సితారతో దిగిన అనేక ఫోటోలు అభిమానులతో పంచుకుంటారు.
ఇక ఆమె అంటే సెలబ్రెటీలకు కూడా చాలా ఇష్టం.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా సితార కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తుంటుంది. ఓసారి మహర్షి షూటింగ్ సమయంలో కుటుంబం అంతా అమెరికాలో ఉన్నారు, ఈ సమయంలో అలియా కూడా అక్కడ సినిమా షూటింగుకు వచ్చింది. ఈ సమయంలో సితారతో ఆమె ఎంతో సంతోషంగా కంపెనీ ఇచ్చింది.
అక్కడ నుంచి వారు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడు వారిద్దరి ఫోటోలు వైరల్ అయ్యాయి,
తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కోసం అలియా భట్ రీసెంట్‌గా హైద్రాబాద్‌లో అడుగుపెట్టింది. ఈ సమయంలో మహేష్ కుమార్తె సితారని కలిసింది, అంతేకాదు ఆమె కోసం ప్రత్యేకంగా తన కంపెనీ
దుస్తులు సితారకి ఇవ్వగా వాటిని చూసి మురిసిపోయిన లిటిల్ ప్రిన్స్ సోషల్ మీడియాలో తెలిపింది ఇవి నాకు ఎంతో నచ్చాయి అని తెలిపింది.