RRR చిత్రం విడుదల ఎప్పుడో పొరపాటున చెప్పేసిన అలిసన్ డూడీ

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు జక్కన్న దర్శకత్వం వహిస్తున్నారు.. బాహుబలి సినిమా తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా ఇది, ఇక ఇందులో చాలా మంది సీనియర్ నటీ నటులు నటిస్తున్నారు.

- Advertisement -

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక రోల్స్ చేస్తున్నారు, అలాగే హాలీవుడ్ నటులు నటిస్తున్నారు రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ కూడా నటిస్తున్నారు, ఇప్పటికే ముఖ్య షూటింగ్ పార్ట్ పూర్తి అయింది, మరి రెండు నెలల్లో మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారు.

ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేదానిపై ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.. అసలు కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ పాటికి సినిమా పూర్తి అయ్యేది.. దీంతో దాదాపు 9 నెలలు ఆలస్యం అయింది, అయితే తాజాగా RRRలో ముఖ్య పాత్ర పోషిస్తోన్న ఐర్లాండ్కు చెందిన నటి అలిసన్ డూడీ పొరపాటున చిత్ర విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట.

ఈ ఏడాది అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారని అలిసన్ డూడీ లీక్ చేసేశారట. తన ఇన్ స్టాలో దీనిపై ఆమె పోస్ట్ పెట్టారు… కాని వెంటనే ఆ తప్పు గ్రహించి డిలీట్ చేశారు, కాని అప్పటికే అభిమానులు దీనిని వైరల్ చేశారు, మరి దీనిపై RRR బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. దీని కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు విడుదల తేదినో చెప్పాలి అని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....