Varun Tej – Lavanya Tripathi |మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మనువాడనున్నాడు. గత కొన్ని రోజులుగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తే నిజమైంది. వీరి నిశ్చితార్థం జూన్ 9(రేపు) జరుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ‘టు హార్ట్స్ వన్ లవ్’’.. ఇద్దరు జీవితాంతం హ్యాపిగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ గ్రీటింగ్ కార్డును సినీ వర్గాలు ట్వీట్స్ చేస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్‌కి విషెస్స్ చెబుతున్నారు. కాగా వరుణ్, లావణ్య(Varun Tej – Lavanya Tripathi) కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాలు చేశారు.
మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి.. రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం
-
- Advertisement -