అలా చేస్తేనే పెళ్లి అని చెప్పా భర్తకి కండిషన్ పెట్టిన కాజల్

అలా చేస్తేనే పెళ్లి అని చెప్పా భర్తకి కండిషన్ పెట్టిన కాజల్

0
118

వ్యాపారి గౌతమ్ కిచ్లుతో ఇటీవల నటి కాజల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరూ ఇప్పుడు హనీమూన్ కు వెళ్లారు, ఇక తర్వాత కొద్ది రోజుల్లో ఆమె ఆచార్య షూటింగ్ లో జాయిన్ కానుంది, ఈ సమయంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర మాటలు చెప్పారు కాజల్.

తన భర్త గౌతమ్ కిచ్లు మోకాలిపై వంగి రోజా పువ్వుతో తన ప్రేమను తెలపకపోయి ఉంటే వివాహం చేసుకునేదాన్ని కాదని తెలిపారు కాజల్, ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ఇద్దరూ, పేరెంట్స్ తో వివాహం గురించి చెప్పారు.

మోకాలిపై వంగి, ప్రపోజ్ చేయకపోతే పెళ్లి చేసుకోనని చెప్పా. అలా సరదాగానే అన్నాను తను కూడా అలా ప్రపోజ్ చేశాడు, మాకు ఇద్దరికి మేమంటే ఒకరికి ఒకరు ఇష్టం ఇలా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నాం అని తెలిపింది కాజల్ ….తొలిసారి ముంబయిలోని ఎన్సీపీఏ కేఫ్కు వీరిద్దరూ డేట్ లో ఉన్న సమయంలో వెళ్లారట.