అల వైకుంఠపురములో ఆ ఇళ్లు ఎవరిదో తెలుసా

అల వైకుంఠపురములో ఆ ఇళ్లు ఎవరిదో తెలుసా

0
103

ఈ 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో ఒకటి అల వైకుంఠపురములో చిత్రం… సక్సెస్ అయి సూపర్ హిట్ తో దూసుకుపోతోంది.ఈ సినిమాలో మెజారిటీ కథ ఒక ఇంట్లోనే జరుగుతుంది. ఆ ఇంటి పేరే వైకుంఠపురం. నిజ జీవితంలో ఆ ఇల్లు ఎవరిదో తెలుసుకోవాలి అని అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ ఇల్లు ఇంటీరియర్ అంతా అన్నపూర్ణలో సెట్ వేసారు. కానీ బయట నుంచి కూడా అంతకు అంతా అందమైన ఇల్లు కావాలి. ఎక్కడ దొరుకుతుంది అనుకున్నారు చివరకు ఓ బడా వ్యాపారవేత్త గారి ఇల్లు సెలక్ట్ చేసుకున్నారు.

ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఎన్టీవీ అధినేత చౌదరి కూతురు రచన అత్తగారి ఇల్లు…ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి వియ్యంకుడు సబ్బినేని సురేంద్రకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నగరంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఉంది. సుమారు రూ. 100 కోట్ల విలువచేసే ఆ ఇల్లు అత్యంత విలాసంగా ఉంటుందట. ఎంతలా అంటే ఆ ఇంటి గార్డెన్ లో పూసే పూలకు కూడా పేటెంట్ ఉంటుంది అంటే మీరు నమ్మక పోవచ్చు.

ఇటలీ నుంచి తెప్పించిన విలువైన మొక్కలు ఎన్నో ఆ ఇంట్లో ఉన్నాయి. ఓ సారి ఆ ఇంటిని అనుకోకుండా చూసిన త్రివిక్రమ్ తన కథకు సరిగ్గా సరిపోయే ఇల్లు దొరికిందని సంతోషించారు. అక్కడ నిర్మాతలు మాట్లాడి 20 రోజులు షూటింగ్ జరిపారు. ఇప్పుడు ఆ ఇళ్లు గురించే అందరూ చూస్తున్నారు అసలు ఇంత అద్బుతమైన ఇళ్లు విదేశాల్లో ఉంటాయి అని అనుకుంటారు కాని మన దేశంలో పైగా హైదరాబాద్ లో ఉన్నాయి అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.