మహర్షి సినిమాలో తన పాత్ర ఏమిటో చెప్పేసిన నరేష్

మహర్షి సినిమాలో తన పాత్ర ఏమిటో చెప్పేసిన నరేష్

0
158

ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం తెరకెక్కుతున్న తాజా చిత్రం `మ‌హ‌ర్షి’. దిల్‌రాజు, అశ్వ‌నిద‌త్ , పీవీపీ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్ముస్తూన్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయినా ఈ చిత్రం పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. మ‌హేష్ కెరీర్ లో ఇది 25 వ సినిమా.అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ ఏ త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నారు అని అందరిలో సందేహం మొదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడు గా నరేష్ నటిస్తున్నటు తాజా సమాచారం.

ఈ విషయం పై అల్ల‌రి న‌రేష్‌ ని అడగగా నా కెరీర్‌లో మ‌రో గాలిశీను లాంటి రోల్ చేస్తున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను అని అయన అన్నారు. ఇప్పటివరకు 45 రోజుల షెడ్యూల్లో పాల్గొన్నాను.ఇంకా 100రోజుల జ‌ర్నీ చేయాల్సి ఉందని అయన తెలిపారు.అయితే ఈ సినిమాలో మ‌హేష్ రైతుగా, విద్యార్థిగా న‌టిస్తున్నార‌ని, అత‌డికి స్నేహితుడిగా న‌రేష్ న‌టిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కారు కొడుతున్నాయి.