ఏదైనా పెద్ద సినిమా పెద్ద హీరోతో సినిమా చేస్తే అవకాశాలు బాగా వస్తాయి అని అనుకుంటారు.. కాని ఇక్కడ రివర్స్ అయింది. అల్లరి నరేష్ మహేష్ బాబుతో కలిసి మహర్షి సినిమాలో స్నేహితుడి పాత్ర చేశాడు. నరేష్ పాత్ర అద్బుతం అనే చెప్పాలి. మంచి క్యారెక్టర్ సినిమాలో ఆయనకు వచ్చింది… అయితే హీరోనే కాదు తనలో ఈ కోణం కూడా ఉంది అని చూపించాడు నరేష్ .
అయితే తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు రాలేదు, కాని అనూహ్యంగా సైలెంట్ గా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో చిత్రం చేశారు. కొద్దిగా వర్క్ మాత్రమే మిగిలింది. ఈ సమయంలో ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో ఫుల్ బిజీ అయిపోయారు. మహేష్ సినిమా, దాదాపు 150 కోట్ల సినిమా సంక్రాంతికి బరిలో ఉంది, దీంతో నరేష్ సినిమా అలా మిగిలిపోయింది, ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత నరేష్ సినిమా ఫినిష్ అవుతుందట.
ఈ సమయంలో నరేష్ హీరోగా మరో సినిమా ఒకే చేసుకున్నారట. అది వచ్చే నెల నుంచి సినిమా షూట్ స్టార్ట్ అవనుంది.