అల్లు అరవింద్ నయా బిజినెస్ కోట్ల పెట్టుబడి

అల్లు అరవింద్ నయా బిజినెస్ కోట్ల పెట్టుబడి

0
81

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్ అంటే అల్లు అరవింద్ అనే చెబుతారు అందరూ. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అనేక గొప్ప చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఆయన కుమారుడు బన్నీ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అలవైకుంఠపురంలో నిర్మాతగా కూడా భాగస్వామిగా ఉన్నారు.

తాజాగా ఆయన యంగ్ హీరో నిఖిల్ తో ఓ మూవీ చేయనున్నట్లు ప్రకటించారు, ఈ సినిమాకి
వి ఐ ఆనంద్ దర్శకత్వం చేయనున్నారు. తాజాగా అల్లు అరవింద్ ఓ టి టి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ రంగంలోకి అడుగుపెట్టారట. తన మొదటి ప్రాజెక్ట్ గా అర్జున్ సురవరం మూవీ డిజిటల్ హక్కులు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు దీని విలువ 2.5 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.వచ్చే ఏడాది వచ్చే నెలలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి ఒక పేరు కూడా నిర్ణయించనున్నారట. ఇక భవిష్యత్తు అంతా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ దే అని ఆయన భావిస్తున్నారు అందుకే ఈ రంగంలో పెట్టుబడులకు వచ్చారు అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. తాజాగా తెలుగు చిత్రాలు అన్నీ అమెజాన్ రైట్స్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.