అక్కినేని సమంత ప్రధాన పాత్రలో పౌరాణిక ప్రేమగాధ శాకుంతలం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ రీహో దేవ్ మోహన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమాపై ఎన్నో హోప్స్ ఉన్నాయి.
ఈ సినిమాతో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ వెండి తెర అరంగేట్రం చేస్తోంది. ఇందులో అర్హ ప్రిన్స్ భరత పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియచేసింది.
తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో అల్లు అర్హ జాయిన్ అయ్యింది.
ఈ సందర్భంగా అల్లు అర్హకు ఘనంగా స్వాగతం పలికింది శాకుంతలం టీమ్. కార్వాన్కు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు నిర్మాత నీలిమ గుణశేఖర్. ARHA లెటర్ బెలూన్లతో అందంగా ముస్తాబు చేసి స్వాగతం పలికారు. ఇక అల్లు ఫ్యాన్స్ చాలా ఆనందంలో ఉన్నారు. అల్లు ఫ్యామిలీ నుంచి నాల్గోతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది అంటున్నారు అభిమానులు.