అల్లు అరవింద్ కోరిక బయటపెట్టారు మరి విజయ్ ఏం చేస్తారో

అల్లుఅరవింద్ కోరిక బయటపెట్టారు మరి విజయ్ ఏం చేస్తారో

0
95

విజయ్ దేవరకొండ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో, అయితే చేసిన సినిమాలు అన్నీ ఆల్ టైం హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నిర్మాతలు దర్శకులు ఆయనతో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఆయన.

ఆయనకు మంచి ఫేమ్ తెచ్చిన రెండు చిత్రాలు గీతా ఆర్ట్స్ 2లో చేశారు…టాక్సీవాలా.. గీత గోవిందం సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి… తాజాగా ఈ బ్యానర్లో విజయ్ దేవరకొండ మరో మూవీ చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా 14వ తేదినఅభిమానుల ముందుకు రానుంది.

ఈ సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు, హీరో విజయ్ తో మరో సినిమా చేయాలని ఉంది అని చెప్పారు… విజయ్ ఎస్ చెబితే మేము సినిమా చేయడానికి రెడీ అన్నారు..దీంతో ఇంత హిట్ ఇచ్చిన బ్యానర్ లో కచ్చితంగా విజయ్ తదుపరి చిత్రం ఉంటుంది అని టాక్ అయితే నడుస్తోంది.