బుర్జ్‌ ఖలీఫాపై అల్లు అర్హ బర్త్‌డే పార్టీ..ఫోటోలు వైరల్

0
105

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. నవంబరు 21న అల్లు అర్హ పుట్టినరోజు. అయితే, అర్హ పుట్టినరోజు కోసం అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు దుబాయ్ వెళ్లారు. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం అయిన బుర్జ్​ ఖలీఫాపై అర్హ చేత కేక్​ కట్​ చేయించి పుట్టినరోజు వేడుకలను జరిపింది.

అర్హ.. సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాతో త్వరలోనే వెండితెర అరంగేట్రం చేయనుంది. గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. ఇందులో సామ్​.. శాకుంతలగా కనిపించనుంది. ఇక అల్లు అర్జున్​.. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అల్లు అర్జున్ ఖాళీగా కాస్తంత స‌మ‌యం దొరికినా త‌న కుటుంబానికే కేటాయిస్తారు. అల్లు అర్జున్ భార్య స్నేహ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. త‌మ విష‌యాల‌ను ఆమె షేర్ చేస్తుంటుంది. త‌మ పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటారు.