నితిన్ గురించి అల్లు అర్జున్ ఏమ‌న్నాడో తెలిస్తే షాక్

నితిన్ గురించి అల్లు అర్జున్ ఏమ‌న్నాడో తెలిస్తే షాక్

0
112

నితిన్ భీష్మ సినిమా సూప‌ర్ హిట్ అయింది, ఈ చిత్రంలో నితిన్ న‌ట‌న‌కు ర‌ష్మిక న‌ట‌న‌కు నూరు మార్కులు వేస్తున్నారు అంద‌రూ.. తాజాగా అల్లు అర్జున్ దీనిపై నితిన్ కు కంగ్రాట్స్ తెలిపారు.
డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నితిన్. ఇక నీ పెళ్లి వేడుకలు డబుల్ జోష్ లో సాగుతాయి. మంచి టైమ్ వస్తే, అంతా మంచిగానే జరుగుతుంది. నీకు అంతా మంచే జరగాలి. ‘భీష్మ’ టీమ్ మొత్తాన్ని నేను అభినందిస్తున్నా” అని మెగా హీరో అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు

నిజ‌మే టాలీవుడ్ లో అంద‌రూ నితిన్ కు చాలా కాలం త‌ర్వాత హిట్ రావ‌డంతో అభినందిస్తున్నారు.. సినిమా బాగుంద‌ని ఈ చిత్రం సూప‌ర్ హిట్ అయింది అని అంటున్నారు.. అయితే ఇప్ప‌టికే సినిమా వ‌సూళ్లు బాగున్నాయి, ఇక చిత్రానికి సంబంధించి అప్పుడే లాభాలు కూడా వ‌స్తున్నాయ‌ట‌.

ఇక మరో ట్వీట్ పెట్టిన బన్నీ, ఓ మంచి కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టెయినర్ ను అందించినందుకు డైరెక్టర్ వెంకీకి కంగ్రాచ్యులేషన్స్. రష్మికకు, నిర్మాత వంశీకి శుభాకాంక్షలు. అని ట్వీట్ పెట్టారు.