అల్లు అర్జున్ సినిమా మరో రికార్డ్

అల్లు అర్జున్ సినిమా మరో రికార్డ్

0
78

సోషల్ మీడియాలో సినిమాలకు విపరీతమైన బజ్ వస్తోంది… ఇక క్లాస్ లుక్ సినిమాల కంటే మాస్ సినిమాలకు క్రేజ్ అమాంతం ఉంటోంది.. ఇక సూపర్ స్టార్ హీరోల చిత్రాలకు అభిమానులు ప్రమోషన్స్ వారికి వారే అదరగొడుతున్నారు, తాజాగా క్రేజీస్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్ర టీజర్ రిలీజ్ అయింది.

దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ వచ్చింది.. అంతేకాదు ఒక ఏడు నిమిషాల్లో వన్ మిలియన్ వ్యూస్ సంపాదించింది ఈ టీజర్ .. ఇక కొత్త ధనం కోరుకునే దర్శకుడు త్రివిక్రమ్ తో కొత్తగా నటించాలి అని అనుకునే హీరో తోడయితే అదే అల వైకుంఠపురంలో అని చెప్పాలి.. బన్నీ త్రివిక్రమ్ కు ఇది మూడోవ చిత్రం.

టీజర్ చివరన విలన్ సముద్ర ఖనిని ఇమిటేట్ చేస్తూ..నువ్వు ఇప్పుడే కారు దిగావ్..నేను ఇప్పుడు క్యారెక్టర్ లోకి ఎక్కా అని బన్నీ చెప్పే సీన్ అదిరింది.. టీజర్ మధ్యలో స్టయిల్ గా వుంది కదా అందుకే నాకు నచ్చింది అనే సీన్లో ఎక్స్ ప్రెషన్ లు బాగున్నాయి. బన్నీ అభిమానులు మాత్రం వీటిని మాత్రం ఇమిటేట్ చేస్తున్నారు.. సింపుల్ గా చెప్పాలి అంటే క్లాసిక్ సూపర్ టీజర్ అనే చెప్పాలి అంటున్నారు అభిమానులు.