అల్లుఅర్జున్ సినిమా టైటిల్ బాలయ్యకోసం తీసుకుంటారా?

అల్లుఅర్జున్ సినిమా టైటిల్ బాలయ్యకోసం తీసుకుంటారా?

0
99

బాలయ్య బాబుతో బోయపాటి సినిమా అనేసరికి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.. ఇక చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా వర్క్ స్టార్ చేసింది… అలాగే బోయపాటి కూడా సౌత్ ఇండియాలో ఓ టాప్ హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నారు. బాలయ్య పక్కన ఆమె అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆమెని ఫైనల్ చేసే అవకాశం ఉంది.

అయితే బాలయ్య బోయపాటి సినిమాల్లో హీరోయిజంతో పాటు ప్రతినాయకుడి పాత్ర కూడా కీలకంగా ఉంటుంది.. అలాగే టైటిల్ విషయంలో కూడా బాలయ్య బోయపాటి అదిరిపోయే టైటిల్ తీసుకుంటారు. తాజాగా రెండు చిత్రాలు బ్లాక్ బ్లాస్టర్ అయ్యాయి, సింహ లెజెండ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే.. ఐదేళ్ళ గ్యాప్ తరువాత బాలయ్యతో ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు బోయపాటి.

ఇక జనవరి 20 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.. మే లో సినిమా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. తాజాగాఈ సినిమాకి ఐకాన్ అనే పేరు అయితే బావుంటుందని భావిస్తున్నాడట బోయపాటి. కాకపోతే, ఇప్పటికే ఆ టైటిల్ తో అల్లు అర్జున్ ఓ సినిమాని ప్రకటించడం, రీసెంట్ గా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వస్తుండడంతో… ఆ టైటిల్ కోసం నిర్మాత దిల్ రాజుని సంప్రదిస్తారు అని తెలుస్తోంది. మరి త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. అయితే మరికొందరు మాత్రం ఈ సినిమా ఆగలేదు అని చెబుతున్నారు. చూడాలి మరి ఏ టైటిల్ పెడతారో.