బ‌న్నీ – ఇండియాలోనే ఓ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడా ?

Allu Arjun going to create a sensational record in India?

0
109

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ క‌న్న‌డ మ‌ల‌యాళ హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది ఈ చిత్రం. తొలి సాంగ్ ఎంతో సూప‌ర్ హిట్ అయింది. మంచి రెస్పాన్స్ అందుకుంది అన్నీ భాషల్లో. ఇక బ‌న్నీకి ఇటు సౌత్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉంది. దీంతో ఈ చిత్రంపై హై ఎక్స్ పెక్టేష‌న్స ఉన్నాయి.

పుష్ప మూవీ విడుదల కాబోతున్న ఐదు భాషల్లోనూ దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ తోనే డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో ఉన్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా ఓ అద్భుతం అనే చెప్పాలి. ఇలా చేస్తే ఇది రికార్డ్ అవుతుంది. అయితే బ‌న్నీ కూడా దీనికి రెడీ అయిన‌ట్టు వార్త‌లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

బ‌న్నీ ఫ్యాన్స్ అన్నీ భాష‌ల్లో అల్లు అర్జున్ డబ్బింగ్ చెబితే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే దీనిపై ఏమైనా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ చూడాల్సిందే . సుకుమార్ సార్ ఏం చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. సో ఈ నిర్ణ‌యం తీసుకున్నా ఏమీ ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్