బన్నీ వరుసగా మూడు ప్రాజెక్టులు – టాలీవుడ్ టాక్

Allu Arjun New Movie Updates

0
116

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఇక షూటింగ్ కూడా చివరి దశకు వచ్చినట్లే తెలుస్తోంది. జూలై నెల ఆఖరుకి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ టాక్.
ఈ సినిమాను క్రిస్మస్ కు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. రష్మిక కథానాయికగా ఈ చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇక పుష్ప పూర్తి అయిన తర్వాత బన్నీ ఐకాన్ సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఇటీవల మరో వార్త కూడా వినిపించింది. బన్నీ మురుగదాస్ తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి ఇంకా స్టోరీ వర్క్ జరుగుతోందట. అన్నీ సెట్ అయితే ఈ సినిమాపై కూడా ప్రకటన రావచ్చు.

ఇక మరో టాక్ ఏమిటి అంటే. అల్లు అర్జున్ బోయపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో సరైనోడు వంటి భారీ హిట్ వచ్చింది. ఇక ఈసారి బోయపాటి మరో సూపర్ స్టోరీ బన్నీకి చెప్పారట. ఈ స్టోరీ కూడా ఆయనకు నచ్చింది అని టాలీవుడ్ టాక్. వేణు శ్రీరామ్, మురుగదాస్ సినిమాల తరువాత బోయపాటి చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.