అల్లు అర్జున్ తాజాగా పుష్ప చిత్రం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంతభాగం పూర్తవ్వాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ ఇచ్చారు. ఇక వచ్చే నెల నుంచి ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఇక 20 శాతం మేర షూటింగ్ అయితే ఫస్ట్ పార్ట్ పూర్తి అవుతుంది అంటున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఐకాన్ చిత్రం చేయనున్నారు. ఈ సినిమాకి వేణుశ్రీరామ్ దర్శకుడు. ఐకాన్ ఈ టైటిల్ బన్నీ అభిమానులలో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఐకాన్ టైటిల్ కి కనబడుటలేదు అనేది ట్యాగ్ లైన్ గా ఉంచారు.
ఈ ట్యాగ్ లైన్ అందరిలో కుతూహలాన్ని రేకెత్తించింది. అయితే దీనికి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బన్నీ ఎవరికి కనిపించకుండా సీక్రెట్ మిషన్స్ చేస్తారని అంటున్నారు, మరికొందరు ఏకంగా ఈ సినిమా అంతా ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అంటున్నారు. అయితే ఎవరికి తోచిన కథ వారు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ వాస్తవం కాదు అంటున్నారు బన్నీ టీమ్. ఇందులో బన్నీ సరికొత్త లుక్ లో కనిపించనున్నారట.