AAA Cinemas | ఈ మధ్యకాలంలో తెలుగు స్టార్ హీరోలు సినిమాలతో పాటు వేరే వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెడుతూ చేతినిండా సంపాదిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబీ మాల్, విజయ్ వరంగల్ లో ఏవీడీ మల్టీప్లెక్స్ లను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరాడు. హైదరాబాద్ అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఏఏ సినిమాస్(AAA Cinemas) పేరిట భారీ మల్టీప్లెక్స్ నిర్మించారు. అత్యాధునిక హంగులతో నిర్మితమైన ఈ సినిమా థియేటర్ కాంప్లెక్స్ నేడు ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్, ఏషియన్ సినిమాస్ భాగస్వాములు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో బన్నీని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. వారందరికీ నమస్కారం చేస్తూ తన విథేయత చాటుకున్నారు అల్లు అర్జున్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాతో రేపు ఈ థియేటర్ అభిమానులకు అందుబాటులో ఉండనుంది.