బన్నీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్…మెగా ఫ్యాన్స్ కి పండగే

బన్నీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్...మెగా ఫ్యాన్స్ కి పండగే

0
93

నా పేరు సూర్య తరువాత చాల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా ఆలా వైకుంఠపురంలో.. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. కాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన బన్నీ, తన స్టైలిష్ లుక్ తో మొత్తానికి అభిమానులను ఫిదా చేశాడు.

కాగా ఈ సినిమా టీజర్ ను అక్టోబర్ 8న దసరా స్పెషల్‌ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.ఇక పోతే ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ ఫైనల్ అని తెలుస్తోంది.

ఈ డేట్ కే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.