బ‌న్నీ త‌ర్వాత సినిమా – టాలీవుడ్ డైరెక్ట‌రా? కోలీవుడ్ డైర‌క్ట‌రా ?

Allu Arjun next movie with tollywood director or kollywood director ?

0
127

తెలుగులో స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. కోట్లాది మంది ఆయ‌న్ని అభిమానిస్తారు. ఇటు తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళంలో కూడా ఆయ‌న‌కు ల‌క్ష‌లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక అల వైకుంఠ‌పురం చిత్రం త‌ర్వాత బ‌న్నీ పుష్ప చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాపై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఇక సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క‌రోనా ప‌రిస్ధితి లేక‌పోతే ఈ పాటికి చిత్రం పూర్తి అయ్యేది.

ఇక ఇప్పుడు పుష్ప షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్ . కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. ఇక ఈ సినిమా చేసిన త‌ర్వాత బ‌న్నీ ఏ చిత్రం చేస్తారు అనేదానిపై అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌న్నీ ఐకాన్ సినిమా చేయనున్నాడనే టాక్ వచ్చింది. ఈ సినిమాకి వేణు శ్రీరాం ద‌ర్శ‌కుడు, ఇక నిర్మాత‌గా దిల్ రాజు చేస్తున్నారు.

అయితే అంద‌రూ ఐకాన్ గురించి చ‌ర్చించుకుంటుంటే? తాజాగా కోలీవుడ్ నుంచి మ‌రో వార్త వినిపిస్తోంది.
సుకుమార్ చిత్రం పూర్తి అయిన తరువాత మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ చిత్రం చేయనున్నాడనేది ఆ వార్త . బన్నీకి మురుగదాస్ కథ వినిపించాడని ఈ సినిమాకి ఒకే చెప్పారు అని తెలుస్తోంది.