Allu Arjun | అల్లు అర్జున్ కి మరోసారి పోలీస్ నోటీసులు

-

హీరో అల్లు అర్జున్(Allu Arjun) కి మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళడానికి వీల్లేదంటూ రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు అందించారు. ఆయన కిమ్స్ ఆస్పత్రిలో బాలుడు శ్రీతేజ్‌(Sri Tej)ను పరామర్శిస్తానన్న నేపథ్యంలో పోలీస్ నోటీసులు అందాయి. అల్లు అర్జున్ కిమ్స్(KIMS) ఆస్పత్రికి వెళ్ళడానికి వీల్లేదని, ఒకవేళ వెళ్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాంగోపాల్ పేట్ పోలీసులు అల్లు అర్జున్‌ మేనేజర్‌కు నోటీసులు అందజేశారు.

- Advertisement -

కాగా, డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్ళారు. తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు భారీగా రావడంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే బాలుడిని, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు అల్లు అర్జున్(Allu Arjun) వెళ్ళకపోవడంతో విమర్శలు వ్యక్తం అయ్యాయి.

అయితే కొన్ని లీగల్ సమస్యల కారణంగా తాను ఆసుపత్రికి వెళ్ళలేకపోతున్నానని, అవకాశం ఉంటే కచ్చితంగా వెళ్తానని అల్లు అర్జున్ ఓ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇప్పుడు తొక్కిసలాట ఘటనలో ఏ11 గా ఉన్న బన్నీకి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో తాను శ్రీతేజ్ ని పరామర్శించేందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు.

Read Also: వణికిస్తున్న HMPV వైరస్.. తెలంగాణ లో కేసులపై స్పందించిన హెల్త్ డైరెక్టర్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...