అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా రిలీజ్ డేట్ అదేనట

అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా రిలీజ్ డేట్ అదేనట

0
91

తాజాగా అల వైకుంఠపురం చిత్రంతో మంచి సక్సెస్ మీద ఉన్నారు బన్నీ, ఇక ఇప్పుడు సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేశారు, వీరి కాంబినేషన్లో మూడో సినిమా పట్టాలెక్కింది అనే చెప్పాలి. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగు కేరళలో జరిగింది. ఇక అందులో బన్నీ పాల్గొనలేదు కాని తదుపరి షూటింగ్ షెడ్యూల్ లో బన్నీ నటించనున్నారట.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన పాత్ర పరంగా బన్నీ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడతాడు. అయితే అడవి నేపథ్యంలోని పూర్తి సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో బన్నీ కనిపించనున్నారు అని తెలుస్తోంది, ఆయన ఇందులో లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు.

ఇందులో బన్నీకి జోడీగా రష్మిక కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయాలనే నిర్ణయానికొచ్చారు. అక్టోబర్ 2వ తేదీన ఆర్ఆర్ఆర్ ను విడుదల చేసే అవకాశాలు వున్నాయి. అందువలన ముందు నెలలోనే బన్నీ – సుకుమార్ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సో అందుకే చిత్ర షూటింగ్ కూడా వేగంగా చేయాలి అని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.