తమన్ కోసం ట్రై చేసిన బన్నీ నో చెప్పిన సుకుమార్

తమన్ కోసం ట్రై చేసిన బన్నీ నో చెప్పిన సుకుమార్

0
101

తాజాగా సుకుమార్ బన్నీ చిత్రం ఇప్పుడు పట్టాలెక్కిన విషయం తెలిసిందే.. ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు సుకుమార్, అలాగే బన్నీ ఈ చిత్రంలో ఎర్రచందనం స్మగ్గింగ్ కు సంబంధించి లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడట.. అందుకే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఎన్నడూ చేయని రోల్ అల్లు అర్జున్ ఇందులో చేస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికని తీసుకున్నారు.. ఇప్పటికే తొలి షెడ్యూల్ కూడా అడవుల్లో పూర్తి చేశారు..ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని బన్నీ వ్యక్తం చేశాడట. అయితే దీనికి కారణం కూడా ఉంది బన్నీకి తాజాగా అల వైకుంఠపురం ఇచ్చిన హిట్ వల్ల తమన్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నారట.

కాని సుకుమార్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ తో తనకి మంచి బాండింగ్ ఉందని, తన సినిమాలకి ఆయన ఇచ్చిన సంగీతం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వచ్చిందని అన్నాడట. మొత్తానికి సుకుమార్ మాత్రం దేవీని ఫైనల్ చేశారు అని తెలుస్తోంది. మైత్రీ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.