అల్లు సినిమా అనౌన్స్ చేసిన వర్మ

అల్లు సినిమా అనౌన్స్ చేసిన వర్మ

0
139

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన సినిమాలు తీస్తున్నాడు, ఇప్పటికే ఆయన తిసిన సినిమాలు ఎన్ని సంచనాలు సృష్టించాయో తెలిసిందే. అందరూ ఇంటికి పరిమితం అయితే, ఈ లాక్డౌన్ తర్వాత డిజిటల్ మార్కెట్లోకి వచ్చిన ఆర్జీవీ సరికొత్త సినిమాలు తీస్తున్నారు, అంతేకాదు అనేక సినిమాల పేర్లు ప్రకటిస్తున్నారు.

ఎలాంటి సెన్సార్లు లేకపోవడంతో తెలివిగా టార్గెట్ చేసుకుంటూ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ సినిమా తీశాడు, తాజాగా మరో బాంబు పేల్చాడు. తన తదుపరి సినిమా పేరును ప్రకటించి మరోసారి సంచలనం రేపాడు.

అల్లు అనే ఫిక్షనల్ సినిమాను తాను తెరకెక్కిస్తానని ట్వీట్ చేశాడు. ఓ స్టార్ హీరో కుటుంబం కోసం అతడి బామ్మర్ది ఏం చేశాడో దాంట్లో చూపిస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర రకరకాల కథలను అల్లుతాడని, అందుకే ఆ పేరు పెట్టానని చెప్పుకొచ్చాడు. …ఈ సినిమాలో ఎ.అరవింద్, కె.చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎ.అర్జున్, ఎ.శిరీష్, కె.ఆర్.చరణ్, ఎన్.బాబు పాత్రలు కూడా ఉంటాయని చెప్పేయడంతో ఇక ఇది అల్లు ఫ్యామిలీపై సినిమా అని అంతా మాట్లాడుకుంటున్నారు.