కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నాడు యువ హీరో అల్లు శిరీష్. ఇక ఇప్పుడు సోషల్ మీడియాకు గుడ్‌బై చెబుతూ అల్లు శిరీష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ‘నవంబరు 11 నాకు స్పెషల్ డే’ అంటూ ట్వీట్ చేశాడు.
2021, నవంబరు 11 నా వృత్తిజీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ విషయం ఏంటో త్వరలో వెల్లడిస్తా. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్‌మీడియాకు దూరంగా ఉంటా” అని ట్వీట్ చేశాడు శిరీష్. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పెళ్లి కుదిరిందా?’, హాలీవుడ్‌కు వెళ్తున్నారా అంటూ ప్రశ్నలు వేశారు. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు..ఇటీవల తాను ఓ కథ విన్నానని ఇది తన కెరీర్లో బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందన్నాడు.
ప్రస్తుతం అల్లు శిరీష్ ‘ప్రేమ కాదంట’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సిక్స్‌ప్యాక్ పెంచి అందరి దృష్టినీ ఆకర్షించాడు శిరీష్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
https://twitter.com/AlluSirish