అల్లు శిరీష్ కోసం రంగంలోకి చిరంజీవి

అల్లు శిరీష్ కోసం రంగంలోకి చిరంజీవి

0
95

మెగా ఫ్యామిలీలో అందరికి గాడ్ ఫాదర్ అంటే చిరంజీవి అని చెప్పాలి.. అయితే ఆయన వేసిన పూలదారిలోనే సినిమాలు చేస్తూ తమ సత్తా చాటుతున్నారు నేటి హీరోలు, ఇక బన్నీ చరణ్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. వరుణ్ సాయిధరమ్ తేజ్ కూడా సినిమాలతో మెగా అభిమానులని అలరిస్తున్నారు. ఇక ఆయన ఇంటి నుంచి అల్లు శిరీష్ కూడా పలు సినిమాలు చేశారు ..అయితే అల్లు శిరీష్ కు అనుకున్నంత హిట్ అయితే సినిమాలు పడలేదు.

దీంతో కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.. ఇటీవల కథల ఎంపిక విషయంలో సాయిధరమ్ తేజ్ కాస్త గాడి తప్పడంతో, చిరంజీవి ఆయన కెరియర్ ను సెట్ చేసే పనిలో పడ్డారు. తేజూ సినిమాలకి సంబంధించిన కథలను ముందుగా ఆయన వింటున్నారు. అందుకే ఇటు శిరీష్ కు సంబంధించి సినిమా కథలుకూడా ఆయన దర్శకుల నుంచి వింటున్నారట.

అయితే చిరు కథలు వింటున్నారు కాబట్టి దర్శకులు కూడా మంచి కథలు అలాగే లైన్ మార్చి మంచి ధీమ్ తో కథ చెబుతున్నారట.. ఇటీవల రెండు కథలు బాగా నచ్చాయి.. మరింత వర్క్ చేయమని ఓ యంగ్ డైరెక్టర్ కు చెప్పారట, త్వరలో ఆ కథ రెడీ అయితే శిరీష్ ఆ ప్రాజెక్ట్ చేయనున్నారు అని తెలుస్తోంది.