అల్లు స్టూడియో ఎన్ని ఎకరాలో తెలుసా ? ఎక్కడ కడుతున్నారంటే

అల్లు స్టూడియో ఎన్ని ఎకరాలో తెలుసా ? ఎక్కడ కడుతున్నారంటే

0
86
Allu Studios

అల్లు అరవింద్ టాలీవుడ్ లో పెద్ద నిర్మాత అనే విషయం తెలిసిందే. అనేక హిట్ సినిమాలు తీశారు ఆయన, నిర్మాతగా చాలా సీనియర్ అనే చెప్పాలి, ఇక మెగా హీరోలతో పాటు అందరితో కూడా ఆయన సినిమాలు చేశారు. అయితే ఇప్పటికే సినిమా పరిశ్రమలో ఉన్న చాలా మంది సీనియర్ హీరోల కుటుంబాలకు ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి.

తాజాగా అల్లు వారి కుటుంబం కూడా అల్లు స్టూడియో నిర్మాణానికి సిద్దం అయింది తాత, ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగాఈ విషయాన్ని అల్లు కుటుంబం తెలిపింది.

అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్
దగ్గుబాటి ఫ్యామిలీకి రామానాయుడు స్టూడియోస్
సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీకి పద్మాలయా స్టూడియో ఉంది
ఇక ఇప్పుడు అల్లు వారి ఫ్యామిలీకి అల్లు స్టూడియో ఉండబోతోంది

ఇక ఇక్కడ భారీ సినిమాలు నిర్మించనున్నారు.. అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అల్లు అరవింద్, అల్లు వెంకట్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ తమ కొత్త స్టూడియోని అనౌన్స్ చేశారు. చిరంజీవి వైజాగ్లో స్టూడియో నిర్మాణానికి రెడీ అవుతుండగా ఇక్కడ హైదరాబాద్ లో అల్లు ఫ్యామిలీ స్టూడియోకి సిద్దం అవుతోంది.

హైదరాబాద్ లోని గండిపేట ప్రాంతంలో ఒక 10 ఎకరాలలో ముందుగా మొదలు పెట్టనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో సినీ, టెలివిజన్ చిత్రీకరణకు అనువుగా ఉండేలా ఈ స్టూడియో నిర్మాణం ఉండనుంది.. త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.