అల్లు అర్జున్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా

అల్లు అర్జున్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా

0
81

అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సునీల్ తో కలిసి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం అల వైకుంఠపురంలో అయితే ఈ సినిమా సంగీతం పాటలతో మరో హైట్స్ కు వెళ్లింది అని చెప్పాలి.. తెలుగులో సరికొత్త రికార్డులు ఇందులో సాంగ్స్ క్రియేట్ చేశాయి.. అందుకే ప్రీ రీలిజ్ ఈవెంట్ వెరైటీగా ప్లాన్ చేశారు. మొత్తం సంగీతంతో పాటలతో హోరెత్తించారు.

ఓ బిడ్డకు తండ్రయిన తర్వాత తండ్రి విలువ తెలిసిందని, కానీ లైఫ్ లో తన తండ్రి అంత గొప్పవాడ్ని మాత్రం ఎప్పటికీ కాలేనని తన తండ్రిలో కనీసం 50 శాతం అయినా పేరు తెచ్చుకోవాలి అని బన్నీ తన కోరికగా చెప్పాడు , ఈ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు బన్నీ. మాట్లాడలేక కన్నీటిపర్యంతమయ్యారు. మాటలు రాక మూగబోయారు, దీంతో కుమారుడు ప్రేమ చూసి తండ్రి అల్లు అరవింద్ స్టేజ్ పైకి వచ్చి హగ్ ఇచ్చారు.

ఇలా తండ్రి కొడుకుల బంధం చూసి అందరూ కన్నీరు పెట్టుకున్నారు, అల్లు అరవింద్ నిర్మాతగా అనేక సినిమాలు చేస్తున్నారు.. 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు.. తాను అంతపేరు తెచ్చుకోలేను మా తండ్రి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు బన్నీ.