అలావైకుంఠపురంలో హీట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు సుకుమార్ తో చేస్తున్నాడు… ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే… ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.
అలాగే హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది… కాగా ఈ చిత్రంలో హీరో పాత్రతో పాటు మరో కీలక పాత్ర ఒకటి ఉంది. దీనికోసం తమిళ నటుడు విజయ్ సేతుపతి మొదట్లో అనుకున్నారు… ఆతర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు… ఆ తర్వాత కొన్ని పేర్లు వినిపించాయి…
కానీ ఇంతవరకు క్లారిటీ రాలేదు… తాజాగా సమాచారం ప్రకారం ఈ పాత్రలో విక్రమ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం ఆయన చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి… మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే… కాగా ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు…