అల్లు అర్జున్ కోసం సుకుమార్ భారీ ప్లాన్

అల్లు అర్జున్ కోసం సుకుమార్ భారీ ప్లాన్

0
77

అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో చిత్రం చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా వర్క్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. ఇక ఇది ఫ్యామిలీ చిత్రం అనేది తెలుస్తోంది, బన్నీ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంటోంది, సినిమా టీజర్ పాటలు అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ ని సెట్ చేశాయి .. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవుతుంది.

అయితే బన్నీ తన తదుపరి సినిమాని కూడా పట్టాలెక్కించారు. తాజాగా సుకుమార్ సినిమాని ఆయన సెట్స్ పైకి తీసుకువెళ్లారు.కేరళ అడవుల్లోని ఓ జలపాతం దగ్గర దర్శకుడు సుకుమార్… హీరో లేని కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.తాజాగా ఈ సినిమాగురించి ఓ వార్త వినిపిస్తోంది.

ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ కోసం దర్శకుడు సుకుమార్ భారీ ప్లాన్ వేశారట. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టైనా సరే ఇంట్రడక్షన్‌ సీన్‌ అదిరిపోయేలా హీరో అల్లు అర్జున్‌ను చూపించాలని భావిస్తున్నారట.ఈ సినిమాలో లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు ఇక వీరి కాంబోలో ఆర్య, ఆర్య2 చిత్రాలు వచ్చాయి ఇది మూడవ సినిమా, బన్నీ మార్కెట్ పెరగడంతో నిర్మాతలు కూడా భారీగానే ఖర్చుకు ముందుకు వస్తున్నారు.