అల్లుఅర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ

అల్లుఅర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ

0
86

రేపు టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురములో విడుదల కానుంది, ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు బన్నీ, అయితే తాజాగా అల్లు అర్జున్కు విజయ్ దేవరకొండ కొత్త దుస్తులు పంపాడు. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. నీకు చాలా కృతజ్ఞతలు సోదరా. ఇదో మధురానుభూతి అని తెలిపారు బన్నీ.

నువ్వు చెప్పినట్టుగానే బట్టలు పంపావు. ఈ డ్రెస్ను వేసుకొని అల వైకుంఠపురములో సినిమా సెలబ్రేషన్కి వస్తా అని అల్లు అర్జున్ తెలిపాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెలిసిందే ఇక విజయ్ దేవరకొండకు కూడా అలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. మాస్ క్లాస్ అందరిని బన్నీ ఎలా ఆకట్టుకుంటాడో విజయ్ కూడా అంతే, తాజాగా బన్నీకి బట్టలు పంపించడంతో ఫ్యాన్స్ కూడా విజయ్ కు థాంక్య్ చెబుతున్నారు.

జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో బన్నీతో త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సో మరికొన్ని గంటల్లో బన్నీధియేటర్స్ లో అలరించనున్నాడు.