అల్లు అర్జున్ కు క‌రోనా ఫ్యాన్స్ కు ఏమి చెప్పారంటే

అల్లు అర్జున్ కు క‌రోనా ఫ్యాన్స్ కు ఏమి చెప్పారంటే

0
96

దేశంలో క‌రోనా కేసులు దారుణంగా వ‌స్తున్నాయి.. ఎక్క‌డ చూసినా ల‌క్ష‌లాది కేసులు న‌మోదు అవుతున్నాయి..ఇక సినిమా ప‌రిశ్ర‌మ‌లో చాలా మందికి క‌రోనా సోకింది ఎక్క‌డ చూసిన చాలా మంది సినిమా న‌టులు క‌రోనా బారిన ప‌డుతున్నారు..

 

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మందికి క‌రోనా సోకింది.. అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు బన్నీ… తాజాగా దీనిపై ట్వీట్ పెట్టారు ఆయ‌న‌.

 

నాకు కోవిడ్ పాజిటీవ్ గా తేలింది, నేను హోం ఐసోలేష‌న్ లో ఉన్నాను, డాక్ట‌ర్లు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు..

ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను నా మిత్రులు నా ఫ్యాన్స్ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు, అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్ర‌స్తుతం ఆయ‌న సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.